ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. సిరీస్‌ను చేజార్చుకుంది. దీని తరువాత పాకిస్తాన్ జట్టు మూడవ టీ20 మ్యాచ్‌కు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే-11ని రెండు గంటల ముందుగానే ప్రకటించింది. ఇందులో ఓ ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ప్లేయింగ్-11లో మహ్మద్ రిజ్వాన్ పేరు లేదు. అతని స్థానంలో సల్మాన్ అలీ అగాకు జట్టు కెప్టెన్సీ అప్పగించారు.
రిజ్వాన్‌కు జట్టులో కూడా చోటు దక్కలేదు. అయితే.. ఈ విషయంపై బోర్డు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రిజ్వాన్‌ను జట్టు నుండి ఎందుకు తొలగించారో తెలియజేయలేదు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌కు రెస్ట్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం పాకిస్థాన్ జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కూడా ఆడనుంది. ఈ పర్యటన కోసం జట్టును కూడా ప్రకటించారు. ప్రకటించిన జట్టులో మొహమ్మద్ రిజ్వాన్‌ను వన్డే సిరీస్‌లో ఉంచారు.. T20లలో లేదు. రిజ్వాన్ స్థానంలో సల్మాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.