యశస్వీ జైస్వాల్.. మరో 'సారీ'
ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు మ్యాచ్‌లో.. భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.
By Medi Samrat
ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు మ్యాచ్‌లో.. భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్.. బౌలింగ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగవ టెస్టులో అతనికి కండరాలు పట్టేయడంతో అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఏడు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ సిరీస్ లో వరుసగా 5వ సారి టాస్ ఓడిపోయాడు. ఈ మ్యాచ్ లో భారతజట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో కీపర్‌గా జురెల్‌ను తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్ , బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. కాంబోజ్ స్థానంలో ఆకాశ్‌ను ఆడిస్తున్నారు.
ఇంగ్లండ్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. జాకబ్ బేతల్, గస్ అట్కిన్‌సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్‌లు జట్టులో చేరారు. భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులు చేసి అట్కిన్సన్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు.