Viral Video : ఫీల్డింగ్ అదిరింది.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రిపీట్..!
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
By Medi Samrat Published on 30 Aug 2024 6:32 PM ISTటీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సూర్య క్యాచ్‌తో మ్యాచ్ భారత్ గెలిచింది. బౌండరీ వద్ద డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సూర్య తరహాలోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ అలాంటి క్యాచ్ పట్టుకున్నాడు.
OMG, WHAT A CARIB CATCH! #CPL #CPL24 #ABFvSKNP #CricketPlayedLouder #BiggestPartyInSport #Carib pic.twitter.com/ovE44jKqHx
— CPL T20 (@CPL) August 30, 2024
సీపీఎల్ లీగ్ తొలి మ్యాచ్ శుక్రవారం ఆంటిగ్వా బార్బుడా ఫాల్కన్స్ vs సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏబీఎఫ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 14వ ఓవర్లో ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్‌లు శామ్ బిల్లింగ్స్, జ్యువెల్ ఆండ్రూ క్రీజులో ఉన్నారు. డొమినిక్ డ్రేక్ వేసిన ఓవర్ చివరి బంతికి బిల్లింగ్స్ ఔట్ అయ్యాడు. అతడి క్యాచ్‌నే ఒడియన్ స్మిత్ ఒడిసి పట్టుకున్నాడు.
ఓవర్ చివరి బంతికి బిల్లింగ్స్ డీప్ స్క్వేర్ లెగ్ వైపు షాట్ ఆడాడు. ఒడియన్ స్మిత్ బౌండరీలో ఉన్నాడు. అతను తన కుడివైపుకు పరిగెత్తి బంతిని బౌండరీ దగ్గర బంతిని ఆపే ప్రయత్నం చేయగా.. అతని బ్యాలెన్స్ తప్పిపోయి.. పాదం బౌండరీని తాకబోతున్నట్లు అనిపించింది. ఆ సమయంలోనే స్మిత్ బంతిని గాలిలోకి విసిరి.. బౌండరీ దాటి మరోసారి మైదానంలోకి వచ్చి క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించి న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ విడీయోపై క్రికెట్ ఫ్యాన్స్.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రిఫీట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.