ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడి టోర్ని నుంచి నిష్క్రమించింది. అయితే.. ఆ టోర్నిలోని తొలి మ్యాచ్‌ను మాత్రం అభిమానులు ఎన్నటికి మరిచిపోలేరు. గ్రూప్ స్టేజ్‌లో దాయాదీ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలిచి టీమ్ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్‌ను విరాట్ మరోసారి గుర్తు చేసుకున్నాడు.
" 2022 అక్టోబర్ 23తేదీకి నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడినప్పటికీ అంత ఎనర్జీని ఎప్పుడూ అనుభవించలేదు. ఆ సాయంత్రం అద్భుతం." అని ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ రాసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కి వెలుతున్న ఫోటోని షేర్ చేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం విరాట్ చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్, కేఎల్ రాహుల్, సూర్య, అక్షర్ పటేల్, దినేశ్ కార్తిక్‌లు విఫలం కాగా.. హార్థిక్ పాండ్య(40) అండతో విరాట్ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.