నితీష్ రెడ్డి అరంగేట్రం చేయబోతున్నాడా.? హింట్ ఇచ్చిన కోచ్..!

పెర్త్‌లో నితీష్ రెడ్డి టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థం అవుతోంది.

By Medi Samrat  Published on  20 Nov 2024 8:55 AM GMT
నితీష్ రెడ్డి అరంగేట్రం చేయబోతున్నాడా.? హింట్ ఇచ్చిన కోచ్..!

పెర్త్‌లో నితీష్ రెడ్డి టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థం అవుతోంది. 21 ఏళ్ల నితీష్ రెడ్డిపై మోర్కెల్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ లో భారతజట్టుకు కీలకంగా మారనున్నాడని మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.

ఆంధ్రాకు చెందిన ఆల్‌రౌండర్ 2024లో IPL సీజన్‌తో ఆకట్టుకున్నాడు. భారత జట్టు తరపున టీ20లో అరంగేట్రం చేశాడు. 23 ఫస్ట్-క్లాస్ గేమ్‌లను మాత్రమే ఆడిన నితీష్ రెడ్డి సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్ గా ఆస్ట్రేలియా పిచ్ లపై ఉపయోగపడే అవకాశం ఉంది. నితీష్ ను బీసీసీఐ ఆస్ట్రేలియాకు చాలా రోజుల ముందే పంపింది. రెండు లిస్ట్ A గేమ్‌లలో కూడా ఆడాడు. రెండవ మ్యాచ్‌లలో ధృవ్ జురెల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో 31 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

నితీష్ రెడ్డిలో ఆస్ట్రేలియాలో సత్తా చాటే ఆల్ రౌండ్ సామర్థ్యం ఉందని మోర్కెల్ అన్నాడు. వికెట్-టు-వికెట్ బౌలింగ్ చేయగలడని, ప్రపంచంలోని ఏ జట్టుకైనా పేసర్లకు సహాయం చేసే ఆల్ రౌండర్ కావాలి. జస్ప్రీత్ అలాంటి వాళ్లను ఎలా ఉపయోగించుకుంటాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ సిరీస్ లో ఖచ్చితంగా గమనించవలసిన వ్యక్తి నితీష్ రెడ్డి అని మోర్కెల్ అన్నాడు. 'షమీపై దృష్టి పెట్టాం.. అతను ఒక సంవత్సరం పాటు బయట ఉన్నాడు. అతను తిరిగి ఆడడం మాకు భారీ విజయం. షమీ ప్రపంచ స్థాయి బౌలర్‌ అని మోర్కెల్‌ అన్నాడు. సిరీస్ ఓపెనర్ సమయానికి శుభమాన్ గిల్ కోలుకోవడంపై మోర్కెల్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు.

Next Story