మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం తెలుగు వాళ్లకు ఎంతో స్పెషల్ గా నిలిచింది. అతని తండ్రి ముత్యాల రెడ్డి చేసిన త్యాగం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. ముత్యాల రెడ్డి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముత్యాల రెడ్డి గవాస్కర్ పాదాలను తాకడం, కౌగిలించుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి తల్లి కూడా గవాస్కర్ పాదాలను తాకారు.
నితీష్ 189 బంతుల్లో 11 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 114 పరుగులు చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నితీశ్ రికార్డు సృష్టించాడు. టాప్-ఆర్డర్ పతనం తర్వాత నితీష్ అద్భుతమైన సెంచరీ చేయడంతో గవాస్కర్ నుండి ప్రశంసలను అందుకున్నాడు.