మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో 3వ రోజు నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు అర్ధశతకం సాధించాడు. నితీష్ రెడ్డి 81 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 21 ఏళ్ల రెడ్డి టీమ్‌కి ఫాలో ఆన్ గండం నుండి తప్పించాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ స్టైల్ లో తన తొలి టెస్టు ఫిఫ్టీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. డిసెంబర్ 5న, పుష్ప 2 థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. ఇప్పుడు మెల్ బోర్న్ లో తగ్గేదే లే అంటూ నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు. మూడో రోజు బ్యాడ్ లైట్ కారణంగా టీ బ్రేక్ తీసుకున్నారు. 85 పరుగులతో నితీష్ నాటౌట్ గా నిలిచాడు. సుందర్ 40 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ఓవర్ నైట్ స్కోరు 164/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 191 పరుగుల వద్ద రిషభ్ పంత్ (28), 221 పరుగుల వద్ద రవీంద్ర జడేజా (17) వికెట్లను కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.