ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ శిబిరంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమ్ ప్రాక్టీస్ సెషన్ సందర్శించిన నీతా అంబానీ, రోహిత్ శర్మను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గత కొన్ని నెలలుగా రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమించి, దాదాపు 11 కిలోల బరువు తగ్గారు. ఈ క్రమంలో ఆయన మునుపటి కంటే చాలా సన్నగా, యంగ్‌గా కనిపిస్తున్నారు.
రోహిత్ కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోయిన నీతా అంబానీ, "రోహిత్! నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నావు" అని ప్రశంసించారు. ఆమె మాటలకు రోహిత్ శర్మ సిగ్గుపడుతూ చిరునవ్వు చిందించారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియాలో పంచుకోగా, అది నెట్టింట వైరల్‌గా మారింది.