ఓటమి దిశగా భారత్.. కివీస్ టార్గెట్ 139
Newzealand Target 139. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో
By Medi Samrat Published on
23 Jun 2021 2:03 PM GMT

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో 170 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. పంత్(41) ఒక్కడే పర్వాలేదనిపించాడు. సౌథీ బౌలింగ్‌లో లాథమ్ క్యాచ్ అందుకోవడంతో బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్.. కివీస్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీసన్ 2, వాగ్నర్ ఓ వికెట్ పడగొట్టారు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌట్ కాగా.. డేవాన్ కాన్వే(54), కేన్ విలియమ్ సన్(49) రాణించడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. దీంతో కీలకమైన 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం న్యూజిలాండ్‌కు దక్కింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులతో నిలిచింది.
Next Story