వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 325 పరుగులకే ఆలౌట్ కాగా.. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్(10/119) చరిత్ర సృష్టించాడు. అయితే.. ఆనందం న్యూజిలాండ్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌ను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వచ్చిన బ్యాట్స్‌మెన్లను వచ్చినట్లే పెవిలియన్ చేరుస్తున్నారు.
దీంతో ప్రస్తుతం కివీస్ 53 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫాలో ఆన్‌ను తప్పించుకునేందుకు ఆ జట్టు స్కోరు 126 దాటాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్ వంద పరుగులైనా దాటుతుందా అన్నది సందేహామే. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్, జయంత్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కివీస్ ఇంకా 272 పరుగుల వెనుకబడి ఉంది.