కివీస్‌కు భారీ షాక్‌.. కేన్ మామ‌కు క‌రోనా

New Zealand captain Kane Williamson ruled out of second Test with Covid.ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 1:19 PM IST
కివీస్‌కు భారీ షాక్‌.. కేన్ మామ‌కు క‌రోనా

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియమ్ స‌న్ క‌రోనా బారిన ప‌డ్డాడు. దీంతో నేటి నుంచి జ‌రిగే రెండో టెస్టుకు అత‌డు దూరం అయ్యాడు. ప్ర‌స్తుతం కేన్ మామ ఐసోలేష‌న్‌లో ఉన్నాడు.

మ్యాచ్ ఆరంభానికి ముందు విలియమ్ స‌న్ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం అత‌డికి నిర్వహించిన రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అత‌డు ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఇక అత‌డి స్థానంలో హ‌మిష్ రూథ‌ర్‌ఫోర్డ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు టామ్ లాథ‌మ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు.

ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ ధ్రువీకరించాడు. అతడు మాట్లాడుతూ.. 'కీలక మ్యాచ్‌లకు ముందు ఇలా తనకు తాను జట్టుకు దూరమవ్వడాన్ని విలియమ్సన్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు ఎంతగా నిరాశ చెందాడో మా అందరికీ తెలుసు. హమీష్‌.. విలియమ్సన్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు' అని గ్యారీ పేర్కొన్నాడు.

కాగా.. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి టెస్టు ఓడింది కివీస్‌. దీంతో సిరీస్‌లో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితుల్లో కేన్ లాంటి ప్ర‌ధాన బ్యాట్స్‌మన్ జ‌ట్టుకు దూరం కావ‌డం నిజంగా కివీస్ గ‌ట్టి ఎదురుదెబ్బ‌.

Next Story