వాషింగ్ట‌న్ సుంద‌ర్ అర్థ‌శ‌త‌కం.. టీమ్ఇండియా 219 ఆలౌట్‌

New Zealand bowl out India for 219 in third ODI.మూడో వ‌న్డేలో టీమ్ఇండియా 47.3 ఓవ‌ర్ల‌లో 219 ప‌రుగుల‌కు ఆలౌటైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 11:41 AM IST
వాషింగ్ట‌న్ సుంద‌ర్ అర్థ‌శ‌త‌కం.. టీమ్ఇండియా 219 ఆలౌట్‌

క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమ్ఇండియా 47.3 ఓవ‌ర్ల‌లో 219 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (51; 64 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) ఒక్క‌డే అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఓవైపు వికెట్లు ప‌డ‌తున్నా, ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్ చేసి భార‌త స్కోర్‌ను 200 ప‌రుగులు దాటించాడు. మిగిలిన వారిలో శ్రేయస్ అయ్య‌ర్‌(49; 59 బంతుల్లో 8ఫోర్లు) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ధావ‌న్‌(28), గిల్‌(13), రిష‌బ్ పంత్‌(10), సూర్య‌కుమార్ యాద‌వ్‌(6), దీప‌క్ హుడా(12)లు విఫ‌లం కావ‌డంతో భార‌త జ‌ట్టు త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మిచెల్‌, మిల్నేలు చెరో మూడు వికెట్లు తీయ‌గా, సౌథీ రెండు, ఫెర్గూస‌న్‌, శాంట్న‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

మూడు వ‌న్డేల సిరీస్‌లో ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోగా, రెండో వ‌న్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. నేటి మ్యాచ్‌లో విజ‌యం సాధించి 1-1తో సిరీస్ స‌మం చేయాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటుండ‌గా బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. దీంతో ప్ర‌త్య‌ర్థి ముందు ఓ మోస్తారు ల‌క్ష్యం నిలిచింది. భార‌త బౌల‌ర్లు ఏమైనా అద్భుతం చేస్తే త‌ప్ప సిరీస్‌ను స‌మం కాదు.

Next Story