పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్ గా రమీజ్ రాజాను నియమించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేకంగా రమీజ్ రాజాని పీసీబీ ఛైర్మన్‌గా నియమించాడు. సోమవారం రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీ రాగానే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇప్పట్లో జరగడం అసాధ్యమని రమీజ్ రాజా స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇప్పట్లో అసాధ్యమని అన్నారు. క్రీడల్లోకి రాజకీయాల్ని తీసుకొచ్చి నాశనం చేశారని.. మేము కూడా ఆ ద్వైపాక్షిక సిరీస్ కోసం తొందరపడటం లేదని అన్నారు. పీసీబీ ఫస్ట్ ఫోకస్ దేశవాళీ, స్థానిక క్రికెట్‌పైనే. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా అంశాల్ని పరిశీలించి నాకు ఈ బాధ్యతని అప్పగించారని. ఇది నాకు పెద్ద ఛాలెంజ్ అని రమీజ్ రాజా చెప్పుకొచ్చారు.

రమీజ్ రాజా ఆ దేశ క్రికెట‌ర్ల జీతాల‌ను భారీగా పెంచేశారు. పాకిస్తాన్ లోని గ్రూప్ డీ ప్లేయ‌ర్స్ ఇన్నాళ్లూ నెల‌కు 40 వేల పాకిస్థాన్ రూపాయ‌ల‌ను (మ‌న క‌రెన్సీలో రూ.17 వేలు) అందుకునే వారు. కానీ ఇప్పుడు వారి జీతాలు ల‌క్ష పెరిగి ల‌క్షా 40 వేల పాక్ రూపాయ‌ల‌కు చేరింది. ఈ పెంపు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని రాజా చెప్పారు. 192 మంది దేశ‌వాళీ క్రికెటర్లు ఈ నిర్ణ‌యం కార‌ణంగా ల‌బ్ది పొందనున్నారు. జాతీయ జట్టులోని గ్రేడ్ ఎ ప్లేయ‌ర్స్ జీతాలు రూ.13.75 ల‌క్ష‌ల నుంచి రూ.14.75 ల‌క్ష‌ల‌కు చేరగా.. గ్రేడ్ బి ప్లేయ‌ర్స్ 9.37 ల‌క్ష‌ల‌కు బ‌దులుగా 10.37 ల‌క్ష‌లు, గ్రేడ్ సీ ప్లేయ‌ర్స్ 6.87 ల‌క్ష‌ల‌కు బ‌దులుగా 7.87 ల‌క్ష‌లు అందుకోనున్నారు. టీమ్‌లో స్థానం కోసం ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, స్వేచ్ఛ‌గా ఆడాల‌ని కొత్త పీసీబీ చీఫ్ ర‌మీజ్ ర‌జా పిలుపునిచ్చారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాక్ మ్యాచ్‌ కోసం పాక్ జట్టు 100 శాతం సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. పాక్ జట్టు మొదటి మ్యాచ్‌లోనే భారత్‌తో అక్టోబరు 24న తలపడనుంది.


M. Sabarish

నేను శ‌బ‌రీష్‌, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో భార‌త్ టుడే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story