ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2023 సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. మే 5, శుక్రవారం నాడు జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో పురుషుల జావెలిన్ ఫీల్డ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. సుహైమ్ బిన్ హమద్ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన దోహా డైమండ్ లీగ్‌లో భాగంగా నీరజ్ మొదటి ప్రయత్నంలో 88.67 మీటర్ల దూరం విసిరాడు. ఇది ఒక అద్భుతమైన త్రో అని చెప్పవచ్చు. దోహా డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలో 88.67 మీటర్ల దూరం విసిరినప్పటికీ.. ఆ తర్వాతి ప్రయత్నాల్లో దాన్ని అతిక్రమించలేకపోయాడు. తెల్లటి టీ-షర్టు, నల్లని హెడ్‌బ్యాండ్ ధరించి పాల్గొన్న నీరజ్ తన మొదటి త్రో తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ తన ప్రత్యర్థులకంటే ముందు స్థానంలో ఉండడానికి మొదటి త్రో చాలా సహాయపడింది. ఆగస్టు 2022లో లౌసాన్‌లో విజయం, జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ విజయం తర్వాత నీరజ్ డైమండ్ లీగ్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇది మూడోసారి. జూన్ 2022లో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ వ్యక్తిగత అత్యుత్తమ త్రో 89.94 మీటర్లుగా నిలిచింది. అయినా కూడా అప్పుడు నీరజ్ కు రెండో స్థానమే దక్కింది.
దోహాలో నీరజ్ త్రో సాగింది ఇలా:
1వ ప్రయత్నం: 88.67మీ
2వ ప్రయత్నం: 86.04మీ
3వ ప్రయత్నం: 85.47మీ
4వ ప్రయత్నం: ఫౌల్
5వ ప్రయత్నం: 84.37మీ
6వ ప్రయత్నం: 86.52మీ