చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా

Neeraj Chopra Diamond League 2022 Finals Highlights. గురువారం జరిగిన చారిత్రాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీని నీరజ్ చోప్రా కైవసం చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  9 Sep 2022 10:12 AM GMT
చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా

గురువారం జరిగిన చారిత్రాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీని నీరజ్ చోప్రా కైవసం చేసుకున్నాడు. త‌ద్వారా ఈ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా నీరజ్ చోప్రా.. ఆ త‌ర్వాత 88.44 మీట‌ర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నాల్లో జావెలిన్‌ను 88.00 మీ, 86.11మీ, 87.00మీ, 83.60 మీట‌ర్ల దూరం విసిరాడు.

చెక్ రిప‌బ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీట‌ర్ల దూరం విసిరి రెండ‌వ స్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 83.73 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలావుంటే.. నీరజ్ 2021లో ఒలింపిక్ స్వర్ణం, 2018లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, 2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకోవ‌డం ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.



Next Story