లాహోర్‌లో ముల్తాన్ సుల్తాన్‌ను ఒక పరుగు తేడాతో ఓడించి లాహోర్ క్వాలండర్స్ తమ రెండవ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాకిస్థాన్ సూపర్ లీగ్-2023 ముగిసింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఆటగాడు రిలీ రోసౌ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ 20 ఓవర్లలో 199/8 పరుగులకే పరిమితమైంది. లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మొదట లాహోర్ క్వాలండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్(65) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ షాహీన్ అఫ్రిది 15 బంతుల్లో 44 పరుగులతో చేయడంతో లాహోర్ క్వాలండర్స్ భారీ స్కోరు నమోదుచేసింది. ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఉసామా మీర్ మూడు వికెట్లు తీశాడు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటం.. ఫైనల్ మ్యాచ్ కావడంతో తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది.
ఇదిలావుంటే.. IPL చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యుత్తమ T20 ఫ్రాంచైజీ లీగ్‌గా పేరొందింది. అయితే.. పిసిబి ఛైర్మన్ నజామ్ సేథీ మాట్లాడుతూ.. డిజిటల్ రేటింగ్‌లో పీఎస్‌ఎల్.. ఐపీఎల్‌ను అధిగమించిందని బాంబు పేల్చాడు. ఫైనల్‌కు ముందు విలేకరుల సమావేశంలో సేథీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు. 150 మిలియన్లకు పైగా ప్రజలు పీఎస్ఎల్‌ను డిజిటల్‌లో వీక్షించారు. ఇది చిన్న విషయం కాదు. అదే దశలో IPL ను డిజిటల్ లో 130 మిలియన్లు చూశారు. PSL డిజిటల్ రేటింగ్ 150 మిలియన్లకు పైగా ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్‌కు గొప్ప విజయమని అన్నాడు. సేథీ వ్యాఖ్యలు భారత, పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల మధ్య వివాదాన్ని సృష్టించేలా ఉన్నాయి. ఇక IPL 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేదికగా తలపడనుంది.