ఆసియా కప్‌లో వివాదం, భారత్–పాక్ క్రికెటర్లపై పరస్పర ఫిర్యాదులు
ఆసియా కప్ సూపర్-4లో భారత్–పాక్ మ్యాచ్ తర్వాత మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
By - Knakam Karthik |
ఆసియా కప్‌లో వివాదం, భారత్–పాక్ క్రికెటర్లపై పరస్పర ఫిర్యాదులు
ఆసియా కప్ సూపర్-4లో భారత్–పాక్ మ్యాచ్ తర్వాత మరోసారి ఉద్రిక్తత నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పాకిస్తాన్ క్రికెటర్లు హారిస్ రౌఫ్, సహిబ్‌జాదా ఫర్హాన్‌ల ప్రవర్తనపై ఐసీసీకి అధికారిక ఫిర్యాదు చేసింది. వీరిద్దరూ మ్యాచ్‌లో అభ్యంతరకర కేతాలు, అసభ్యపదజాలం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. రౌఫ్, భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్‌లను కించపరిచేలా విమానం కూల్చే సంకేతం చేయగా, ఫర్హాన్ తన బ్యాట్‌ను తుపాకీలా పట్టుకొని కాల్పులు జరిపినట్లు సెలబ్రేషన్ చేశాడు. దీంతో వివాదం మరింత రగిలింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ముందు వీరిద్దరూ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ప్రతిగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సానుభూతి తెలుపుతూ, భారత సైనికుల ధైర్యానికి విజయం అంకితం చేసిన వ్యాఖ్యలు రాజకీయవైపుగా ఉన్నాయని పీసీబీ ఆరోపిస్తోంది. అయితే ఆ ఫిర్యాదు గడువు ముగిసేలోపు సమర్పించారా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఇదిలా ఉంటే, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహ్సిన్ నక్వీ కూడా క్రిస్టియానో రొనాల్డో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ భారత వ్యతిరేకంగా మరో వివాదాన్ని రగిలించారు. దీంతో, ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నక్వీతో ఒకే వేదికపై ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.