టీ20లకు వీడ్కోలు ప‌లికిన స్టార్‌ క్రికెటర్‌

Mushfiqur Rahim announces retirement from T20Is.బంగ్లాదేశ్ కు ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ముష్ఫికర్ ర‌హీమ్ షాకిచ్చాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2022 9:13 AM GMT
టీ20లకు వీడ్కోలు ప‌లికిన స్టార్‌ క్రికెటర్‌

బంగ్లాదేశ్ కు ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ముష్ఫికర్ ర‌హీమ్ షాకిచ్చాడు. మ‌రికొద్ది రోజుల్లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆరంభం కానుండ‌గా పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. టెస్టులు, వ‌న్డేల‌పై మ‌రింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

'అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నా. మిగిలిన రెండు ఫార్మ‌ట్ల‌పై దృష్టి పెట్టేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా. అవకాశం వస్తే ఫ్రాంచైజీ లీగులు ఆడతా. వన్డే, టెస్టు మ్యాచుల్లో దేశం తరఫున సగర్వంగా ప్రాతినిథ్యం వహిస్తాను' అని ముష్ఫికర్ ర‌హీమ్ ట్విట్‌ చేశాడు.

35 ఏళ్ల వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్‌మెన్ అయిన ముష్ఫికర్ ర‌హీమ్ ఇప్ప‌టి వ‌ర‌కు బంగ్లాదేశ్ త‌రుపున 102 టీ20ల్లో ప్రాతినిథ్యం వ‌హించాడు. 115 స్ట్రయిక్ రేట్‌తో 1500 ప‌రుగులు చేశాడు. ఇందులో ఆరు అర్థ‌శ‌త‌కాలు కూడా ఉన్నాయి. రహీమ్‌ తన తొలి టీ 20 మ్యాచ్‌ను 2006 నవంబర్‌లో జింబాబ్వేతో ఆడాగా.. చివ‌రి మ్యాచ్‌ను ఈనెల 1 శ్రీలంక ఆడాడు.

కాగా.. ఆసియా క‌ప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే బంగ్లాదేశ్ నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే.

Next Story