వెంకటేష్ అయ్యర్ సెంచరీ వృధా.. ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం
Mumbai Indians won by 5 wkts. ఐపీఎల్ 2023 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది.
By Medi Samrat
Mumbai Indians won by 5 wkts
ఐపీఎల్ 2023 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. కేకేఆర్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టోర్నీలో మూడో ఓటమిని చవిచూసింది.
కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ జట్టులో జగదీషన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టాడు. రహ్మానుల్లా గుర్బాజ్ కూడా 8 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్ విరుచుకుపడ్డాడు. కెప్టెన్ నితీశ్ రాణా విఫలమయ్యాడు. శార్దూల్ ఠాకూర్ 13 పరుగులు చేసి అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వెంకటేష్ అయ్యర్ 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేకేఆర్ 185 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హృతిక్ శోకిన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి శుభారంభం లభించింది. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులు చేసి అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చాలా కాలంగా ఫామ్ లో లేని మ్యాచ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీంతో ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.