కేకేఆర్‌ కెప్టెన్ నితీష్ రాణాతో ముంబై బౌలర్‌ గొడవ.. వాంఖడేలో వేడెక్కిన‌ వాతావరణం

KKR Captain Nitish Rana clashed with Mumbai Indians bowler Hrithik Shokeen. ఐపీఎల్ 2023 22వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది.

By Medi Samrat
Published on : 16 April 2023 5:26 PM IST

కేకేఆర్‌ కెప్టెన్ నితీష్ రాణాతో ముంబై బౌలర్‌ గొడవ.. వాంఖడేలో వేడెక్కిన‌ వాతావరణం

KKR Captain Nitish Rana clashed with Mumbai Indians bowler Hrithik Shokeen


ఐపీఎల్ 2023 22వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ సూర్య టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మ్యాచ్‌లో కేకేఆర్‌ కెప్టెన్ నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత.. ముంబై బౌలర్ హృతిక్ షోకీన్ రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కేవలం 10 బంతుల్లో 5 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడిని హృతిక్ షోకీన్ అవుట్ చేశాడు. నితీష్ రాణా పెవిలియన్ వైపు వెళ్తుండ‌గా షోకీన్ ఏదో అన్నాడు. వెంట‌నే నితీష్ కోపంగా రియాక్ట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ నితీష్ రాణాను వారించాడు. నితీష్, హృతిక్ ఢిల్లీ జట్టు త‌రుపున దేశ‌వాళీ క్రికెట్ ఆడుతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబై ఇండియన్స్‌కి ఇది నాలుగో మ్యాచ్. ఇంతకు ముందు, జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 ఓడిపోయి ఒకదానిలో గెలిచింది. గత మ్యాచ్‌లో ముంబై జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. కానీ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.



Next Story