కీలక మ్యాచ్‌లో విక్టరీతో ప్లే ఆఫ్స్‌కు ముంబై..ఇంటి బాట పట్టిన ఢిల్లీ

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌​లో ముంబై విక్టరీ సాధించింది

By Knakam Karthik
Published on : 22 May 2025 8:30 AM IST

Sports News, IPL 2025 MI VS DC, IPL Playoffs race

కీలక మ్యాచ్‌లో విక్టరీతో ప్లే ఆఫ్స్‌కు ముంబై..ఇంటి బాట పట్టిన ఢిల్లీ

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌​లో ముంబై విక్టరీ సాధించింది. కీలక మ్యాచ్‌లో ఢిల్లీపై ఆ జట్టు 59 పరుగుల తేడాతో నెగ్గింది. ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 2025 సీజన్‌​లో చివరి ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుని సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో 10 జట్లు ఆడితే... నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇందులో మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉండగా, ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్.. నాలుగో స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. అయితే మరికొన్ని లీగ్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో... ఈ నాలుగు జట్ల స్థానాలు అటు ఇటుగా అవుతాయి. ఇందులో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన.. ఎలిమినేషన్ రౌండ్ లో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకే ప్రయత్నం చేస్తున్నాయి.

Next Story