ముంబై ఇండియన్స్ : ఒకే జ‌ట్టు.. ఒకే కుటుంబం.. ఒకే జెర్సీ..

Mumbai Indians unveil new jersey for IPL 2021. ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. జ‌ట్టు జెర్సీలో మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

By Medi Samrat  Published on  28 March 2021 3:08 PM IST
Mumbai Indians unveil new jersey for IPL 2021

ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియ‌న్. టోర్నీ ఆరంభం నుండి మరే ఇత‌ర టీమ్‌కు సాధ్యం కాని రీతిలో నాలుగు టైటిళ్లు సాధించింది. రోహిత్ శర్మ సార‌థ్యంలోని ఈ జ‌ట్టు త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ 14వ సీజన్‌లో కూడా స‌త్తా చాటేందుకు సిద్ద‌మ‌వుతోంది. తాజా‌గా ఈ జ‌ట్టుకు సంబంధించి ఓ విష‌యం అభిమానుల‌తో షేర్ చేసుకుంది మేనేజ్‌మెంట్‌.

ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. జ‌ట్టు జెర్సీలో మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. కొత్త జెర్సీకి సంబంధించిన వివరాలను యాజమాన్యం ట్విట్టర్ లో వెల్లడించింది. రాబోయే సీజన్ లో కొత్త జెర్సీ అంటూ ట్వీట్ చేసింది. 'ఒకే టీం.. ఒకే కుటుంబం.. ఒకే జెర్సీ' అన్న క్యాప్షన్ తో జెర్సీని విడుదల చేసింది.

గత ఏడాది ముదురు నీలి రంగు జెర్సీల్లో మెరిసిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. ఈ సీజ‌న్‌లో లేత నీలి రంగు జెర్సీల్లో ఆడబోతున్నారు. ఇక జెర్సీలు కావ‌ల‌సిన వాళ్లు.. ద సోల్డ్ స్టోర్ నుంచి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదిలావుంటే.. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ టైటిళ్లు సాధించింది.


Next Story