IPL 2023: బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్న బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

Mumbai Indians bring in Sandeep Warrier as Bumrah replacement. ఐపీఎల్ 2023 ఈ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్‌లు తలపడనున్నాయి.

By Medi Samrat  Published on  31 March 2023 5:13 PM IST
IPL 2023: బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్న బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

Mumbai Indians bring in Sandeep Warrier as Bumrah replacement


ఐపీఎల్ 2023 ఈ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్‌లు తలపడనున్నాయి. ఐపీఎల్ 16వ సీజన్‌లో చాలా మంది స్టార్ ప్లేయర్లు గాయం కారణంగా సగం సీజన్‌కు దూరమయ్యారు. ఈ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్‌కి చెందిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నారు. బుమ్రా స్థానంలో మ‌రో ఆటగాడిని ముంబై ప్రకటించింది. IPL 2023 కోసం బుమ్రా స్థానంలో సందీప్ వారియర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది టీమ్ మేనేజ్‌మెంట్‌. దీంతో బుమ్రా స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సందీప్ వారియర్
ముంబై ఇండియన్స్
జట్టులోకి రానున్నాడు.


2021లో ఆరంగ్రేటం చేసి టీమిండియా తరపున ఒక టీ20 ఆడిన సందీప్.. Iఐపీఎల్‌-2023 మినీ వేలంలో అమ్ముడుపోలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ 68 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు సందీప్‌. గ‌తంలో సందీప్‌.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వహించాడు. 31 ఏళ్ల సందీప్ ఐపీఎల్ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. 2012లో దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు తమిళనాడు తరపున ఆడుతున్నాడు. 69 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 83 వికెట్లు, 66 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 217 వికెట్లు తీశాడు. సందీప్ బుమ్రా లేని లోటును ఎలా భ‌ర్తీ చేస్తాడో చూడాలి మ‌రి.!


Next Story