కొంప ముంచిన మిడిల్ ఆర్డ‌ర్‌.. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ

Mumbai indians beat sunrisers hyderabad by13 runs.ముంబై ఇండియ‌న్స్‌. శ‌నివారం స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 150 ప‌రుగులే చేసినా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 7:15 AM IST
Mumbai Indians

మ‌రోసారి స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకోని త‌న ప్ర‌త్యేక‌ను మ‌రోసారి నిరూపించుకుంది ముంబై ఇండియ‌న్స్‌. శ‌నివారం స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 150 ప‌రుగులే చేసినా.. ఆరంభంలో హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్లు భ‌య‌పెట్టినా.. స‌మిష్టి కృషితో చివ‌రికి రోహిత్ సేన‌నే విజ‌యం వ‌రించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేయ‌గా.. ల‌క్ష్య చేద‌న‌లో హైద‌రాబాద్ 19.4 ఓవ‌ర్ల‌లో 137 ప‌రుగులే ఆలౌట్ అయ్యింది. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ ఓట‌మి పాలైంది. ఇంత వ‌ర‌కు గెలుపు బోణీ కొట్ట‌ని హైద‌రాబాద్.. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది.

టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు త‌గ్గ‌ట్లే ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(32 25 బంతుల్లో 2 పోర్లు, 2సిక్స‌ర్లు), డికాక్ (40 39 బంతుల్లో 5 పోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి ఆ జ‌ట్టు 53 0 తో నిలిచింది. ముఖ్యంగా రోహిత్ త‌న‌దైన శైలిలో చెల‌రేగి ఆడాడు. వీరిద్ద‌రి బ్యాటింగ్ చేస్తుంటే.. ముంబై ఈజీగా 200 ప‌రుగులు చేసేలా క‌నిపించింది. అయితే.. ఏడో ఓవ‌ర్లో విజ‌య్ శంక‌ర్.. రోహిత్ ఔట్ చేయ‌గా.. త‌న త‌రువాతి ఓవ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో ఒక్క సారిగా ఇన్నింగ్స్ గాడి త‌ప్పింది. ఇదే స‌మ‌యంలో భారీ షాట్లు ఆడే క్ర‌మంలో హార్థిక్ పాండ్య‌, ఇషాన్ కిష‌న్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్ చేరాడు. చివ‌ర్లో పొలార్డ్ (35 నాటాట్ 22 బంతుల్లో 1 పోర్‌, 3 సిక్స‌ర్లు) రాణించ‌డంతో ముంబై 150 ప‌రుగులు చేసింది.

లక్ష్యం కేవలం 151 పరుగులు. బెయిర్ స్టో శుభారంభం ఇచ్చాడు కూడా. ఓ దశలో 76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 84 మాత్రమే. అయినప్పటికీ, సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేక 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. రాహుల్ చాహార్ 3 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసి తమ జట్టు విజయానికి బాటలు వేశారు. బెయిర్ స్టో 22 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ వార్నర్ 34 బంతుల్లో 36, విజయ్ శంకర్ 25 బంతుల్లో 28 పరుగులు చేశారు. మరే ఆటగాడు కూడా రెండంకెల పరుగులను చేరలేకపోయారు. మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, శంకర్ 28, అభిషేక్ 7, రషీద్ ఖాన్ 0, భువనేశ్వర్ 1, ఖలీల్ అహ్మద్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సన్ రైజర్స్ చివరి 7 వికెట్లూ 36 పరుగుల తేడాలోనే కోల్పోవడం గమనార్హం.




Next Story