Video : రోహిత్ వాయిస్‌ని వాడుకున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ.. కోపంతో ఊగిపోతున్న అభిమానులు

గ‌తంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీషును ఎగతాళి చేయ‌గా

By Medi Samrat
Published on : 21 March 2025 3:43 PM IST

Video : రోహిత్ వాయిస్‌ని వాడుకున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ.. కోపంతో ఊగిపోతున్న అభిమానులు

గ‌తంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇటీవల పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీషును ఎగతాళి చేయ‌గా.. సోషల్ మీడియాలో పాక్ ఫ్యాన్స్ అత‌డిపై విరుచుకుప‌డ్డారు. అలాంటి త‌ర‌హాలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్ వినియోగదారులను ఆకట్టుకుంది. వీడియోలో PSL మస్కట్ PSL ట్రోఫీతో నిలబడి ఉండ‌గా.. బ్యాక్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ వాయిస్ విన‌బ‌డుతుంది.. అందులో రోహిత్‌ ట్రోఫీని గెలవడం సులభం కాదు అని చెప్పడం విన‌వ‌స్తుంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాట‌ల‌ను వీడియోలో వాడారు. అయితే ముల్తాన్ సుల్తాన్ షేర్ చేసిన ఈ వీడియో భారతీయ అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.





పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ క్వాలండర్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. పీఎస్ఎల్ 10లో ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం 13 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇందులో ఎలిమినేటర్, ఫైనల్ ఉన్నాయి.

Next Story