ధోనీ కొత్త పాత్ర.. ఏమయ్యింటుందో.?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్ట్ వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat  Published on  4 March 2024 8:45 PM IST
ధోనీ కొత్త పాత్ర.. ఏమయ్యింటుందో.?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. IPL 2024కి కొన్ని వారాల ముందు ధోనీ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. "కొత్త సీజన్.. కొత్త 'పాత్ర' కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి!" ధోని రాశాడు. ధోనీ 'కొత్త పాత్ర' అని దేని గురించి చెబుతున్నారో అంటూ అభిమానులు తలలు గోక్కుంటూ ఉన్నారు.

2024 సీజన్‌లో తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉంటాడో లేదో ఇంకా ధృవీకరించలేదు. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత, ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. తన శరీరం తనను అనుమతిస్తే CSK కెప్టెన్ హోదాలో వచ్చే సీజన్‌లో తిరిగి రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ధోని రాక కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మార్చి 2వ తేదీ నుండి తమ ప్రీ-సీజన్ శిబిరాన్ని ప్రారంభించింది. మొదటి బ్యాచ్ ఆటగాళ్లు వచ్చారని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) అధికారి మీడియాకు తెలిపారు. పేసర్ సిమర్‌జీత్ సింగ్, ఆల్ రౌండర్ రాజవర్ధన్ హంగర్గేకర్, పేసర్ ముఖేష్ చౌదరి, స్పిన్నర్ ప్రశాంత్ సోలంకి, ఆల్ రౌండర్ అజయ్ మండల్, సీమర్ దీపక్ చాహర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

CSK ఖచ్చితంగా MS ధోని ఫ్రాంచైజీకి మరో సీజన్‌ కెప్టెన్‌గా ఆడాలని కోరుకుంటూ ఉంది. కానీ 42 ఏళ్ల వయస్సులో ధోని నిలకడగా బ్యాటింగ్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. డెవాన్ కాన్వేకి గాయం కారణంగా CSK కి టోర్నమెంట్ ముందు షాక్ తగిలింది. ఈ సీజన్ లో చాలా మ్యాచ్ లకు కాన్వే దూరంగా ఉంటాడని తెలుస్తోంది.

Next Story