టీ 20 ప్రపంచకప్.. ధోనీ ఒక్క పైసా తీసుకోవట్లేదు: దాదా
MS Dhoni won`t charge any fee for being mentor of Team India.యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత
By తోట వంశీ కుమార్ Published on 13 Oct 2021 6:45 AM GMT
యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు మెంటార్‌గా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ధోని ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. ఉచితంగా బాధ్యతలు నిర్వర్తించడానికి ధోని ముందుకు వచ్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. రెండో దశ ఐపీఎల్ మొదలైనప్పుడు దుబాయ్ లో ధోనీతో చర్చించానని, పైసా తీసుకోకుండా మెంటార్ గా వ్యవహరించేందుకు ధోనీ ముందుకు వచ్చారన్నారు. ఈ నెల 17 నుంచి టీ 20 ప్రపంచ కప్ ఆరంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఈ నెల 24న ఆడనుంది.
2019 వన్డే ప్రపంచ కప్ అనంతరం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్‌లో బిజీగా ఉన్న ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్ అందించే పనిలో ఉన్నాడు. క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సీఎస్‌కే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు(బుధవారం) కేకేఆర్, ఢిల్లీ మధ్య జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టుతో సీఎస్‌కే తలపడనుంది.