ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా ధోని

MS Dhoni named captain of ICC Men’s ODI and T20I Teams of the Decade. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత అంతర్జాతీయ

By Medi Samrat  Published on  27 Dec 2020 11:34 AM GMT
ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా ధోని

2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ధోనికి ఎన్నో అవార్డులు ఇప్పటికే లభించాయి. ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే జట్లకు సారథిగా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) లు కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. టెస్ట్ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ కు కూడా స్థానం దక్కింది.



మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.



తనతో పాటు రిటైర్ ప్రకటించినా రైనా, వీరిద్దరి కన్నా ముందే రిటైర్ ప్రకటించిన యువరాజ్ సింగ్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడబోతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపడం లేదు. ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ ఉన్నాడు. ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యే వరకూ అయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ధోని ఆడాలని అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.


Next Story