ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు గెలిచి మంచి ఊపుమీదుంది. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం భారత్‌తో ఐదు టీ20 సిరీస్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు) ప్రకటించింది. ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతం అవుతున్న ఇయాన్ మోర్గాన్ టీ20 స్పెషలిస్టులతో కూడిన జట్టును నడిపించనున్నాడు.
జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్‌లతో కూడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 5 మ్యాచ్ లు అహ్మదాబాద్ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జట్టులో కొందరు ఆటగాళ్లు టెస్టు సిరీస్ ఆడుతుండగా.. చాలా మంది భారత్‌కు రావాల్సి ఉంది. వీరంతా ఫిబ్రవరి 26న భారత్‌కు బయలుదేరనున్నారు.
ఇంగ్లాండ్ టీ20 జట్టు..
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, మొయిన్ అలీ, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, శామ్ బిల్లింగ్స్, అదిల్ రషీద్, రీస్ టాప్లే.
రిజర్వ్ ఆటగాళ్లు..
జేక్ బాల్, మాట్ పార్కిన్సన్