చెత్త ఎక్స్‌పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

By -  Knakam Karthik
Published on : 27 Nov 2025 7:13 AM IST

Sports News, Mohammed Siraj, Air India Express, flight delay

చెత్త ఎక్స్‌పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గౌహతి నుంచి హైదరాబాద్ రావలసిన విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై సోషల్ మీడియా వేదికగా అసహనం వెళ్లగక్కాడు. ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత చెత్త అనుభవమని పేర్కొన్నాడు.

వివరాల్లోకి వెళితే... గౌహతి నుండి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం నంబర్ IX 2884 ఉదయం 7.25కి బయలుదేరాల్సి ఉంది, అయితే ఎయిర్‌లైన్ నుండి ఎటువంటి సమాచారం లేదు మరియు పదే పదే ఫాలో అప్ చేసిన తర్వాత, వారు సరైన కారణం లేకుండా విమానాన్ని ఆలస్యం చేశారు. ఇది నిజంగా నిరాశపరిచింది మరియు ఇది ప్రతి ప్రయాణీకుడి ప్రాథమిక ప్రశ్న. విమానం 4 గంటలు ఆలస్యమైంది మరియు ఇప్పటికీ ఎటువంటి నవీకరణ మమ్మల్ని ఇరుకున పెట్టలేదు. చెత్త ఎయిర్‌లైన్ అనుభవం. వారు నిలబడలేకపోతే ఈ విమానంలో ప్రయాణించమని నేను ఎవరికీ సలహా ఇవ్వను...అని సిరాజ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. గువాహ‌టిలో జరిగిన రెండో టెస్టులో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్ తన సొంత నగరం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న సిరాజ్‌కు, విమానం ఆలస్యం మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. కాగా, నవంబర్ 30 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Next Story