బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు టీమ్ఇండియా భారీ షాక్
Mohammed Shami out of Bangladesh ODIs.టీమ్ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది.
By తోట వంశీ కుమార్
టీమ్ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. తొలి వన్డేకు ముందు టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు.
బంగ్లాదేశ్‌తో పర్యటనకు సన్నాహాకంగా నిర్వహించిన ప్రాక్టీసులో షమీ చేతికి గాయమైంది. వైద్యులు అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరం అని సూచించారు. ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. షమీ భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్ వెళ్లలేదు అని బీసీసీఐ అధికారి తెలిపాడు. అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
🚨 NEWS 🚨: Umran Malik to replace Mohd. Shami in India's ODI squad for Bangladesh series. #TeamIndia | #BANvIND
— BCCI (@BCCI) December 3, 2022
Details 🔽https://t.co/PsDfHmkiJs
షమీ గాయం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. టెస్టు సిరీస్‌కు కూడా షమీ దూరం అయితే టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంఫియన్ షిప్ ఫైనల్‌కు పోటీలో నివాలంటే భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా దూరం కాగా షమీ కూడా లేకపోతే ఆ ప్రభావం జట్టుపై గట్టిగానే పడుతుంది.