దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. ష‌మీ అప్పుడే టీమిండియాతో క‌లిసేది..!

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు భారత జట్టుకు చేదు భారీ షాక్ త‌గిలింది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ

By Medi Samrat  Published on  2 Dec 2023 3:14 PM IST
దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. ష‌మీ అప్పుడే టీమిండియాతో క‌లిసేది..!

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు భారత జట్టుకు చేదు భారీ షాక్ త‌గిలింది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ముఖ్యమైన సిరీస్‌కు ముందు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వచ్చే నెలలో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి. మహ్మద్ షమీ టీ20, వన్డే జ‌ట్ల‌లోకి ఎంపిక చేయలేదు కానీ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్‌ ప్రారంభం కాకముందే మహమ్మద్ షమీ భారత జట్టుకు షాక్ ఇచ్చాడు.

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. దాని చికిత్స కోసం అత‌డు ముంబై వెళ్ళాడు. మహ్మద్ షమీ ముంబైలోని స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ నుండి కూడా సలహాలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. దీని తర్వాత అతడు NCAకి పునరావాసం నిమిత్తం వెళ్తాడు. టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ లోపు మహమ్మద్ షమీ కోలుకుంటాడని జట్టు సెలక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. షమీ కోలుకోవాలని భారత అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

రెండవ మ్యాచ్ టెస్టు జనవరి 3 నుంచి 7 మధ్య జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మహ్మద్ షమీ భారత జట్టులో భాగం కానున్నాడని బీసీసీఐ తెలిపింది. 2023 ప్రపంచకప్‌లో షమీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఏకంగా 24 వికెట్లు ప‌డ‌గొట్టి టోర్నీ టాప‌ర్‌గా నిలిచాడు.

Next Story