విరాట్ శతకం చేయకుంటే ఏమైంది..?
Mohammed Shami came to defend virat kohli.టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రధాన పేసర్ మహమ్మద్
By తోట వంశీ కుమార్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రధాన పేసర్ మహమ్మద్ షమి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ శతకం సాధించకుంటే ఏమవుతుంది.. అయినా ఓ ఆటగాడి స్థాయిని శతకం నిర్వచించలేదని షమి అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో కోహ్లీ శతకాలు సాధించకున్నా అర్థశతకాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. అతడు సాధించే 50-60 పరుగులు కూడా జట్టుకు ఉపయోగపడుతున్నాయన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షమి ఈ వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీకి ఉన్న ఎనర్జీనే అతడిలో ఉన్న మంచి లక్షణం అని.. దాంతో జట్టు సభ్యుల్లో ఎల్లప్పుడూ స్పూర్తి నింపుతాడన్నాడు. అతడు బౌలర్ల కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. 'మాలోని అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి స్వేచ్చనిచ్చాడు. మాతో చర్చించి మా అభిప్రాయాలకు విలువనిస్తాడు. అతడితో మేమెంతో కాలం కలసి ఉన్నాం. దాంతో మా మధ్య మంచి జాప్ఞకలు మిగిలిపోయాయి. అవెప్పటికీ నా హృదయంలో నిలిచిపోయాయి' అని షమి చెప్పాడు.
విరాట్ బ్యాటింగ్ పై వస్తున్న విమర్శలపై స్పందించాడు. 'కోహ్లీ సెంచరీ చేయకపోతే ఏమైంది? ఒక్క శతకమే అతను ఎంతో పెద్ద ప్లేయరో నిర్వచించలేదు. అయినా అతను పరుగులు చేయకుండా ఉండటం లేదు కదా. సెంచరీలు చేయకున్నా నిలకడగా హాఫ్ సెంచరీలు బాదుతున్నాడు. అతను చేసే 50, 60 పరుగులైనా జట్టుకు ఉపయోగపడుతున్నాయి కదా?'అని షమీ విరాట్‌కు అండగా నిలిచాడు.
కాగా.. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలయ్యాక పలువురు నెటిజన్లు షమీపై వ్యక్తిగతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోహ్లీ.. షమికి అండగా నిలిచాడు.