మహిళా క్రికెట్ జట్టుపై అజారుద్దీన్ మండిపాటు

Mohammed Azharuddin slams India after cricket finals defeat. ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఓడిపోయిన

By M.S.R  Published on  8 Aug 2022 8:44 AM GMT
మహిళా క్రికెట్ జట్టుపై అజారుద్దీన్ మండిపాటు

ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జాతీయ మహిళా క్రికెట్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ మండిపడ్డారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ప్రస్తుత ప్రపంచ టీ20 చాంపియన్ ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. 162 పరుగుల ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు కేవలం 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పోరాడి.. చివరికి ఓటమిని చవి చూసింది. మహ్మద్ అజారుద్దీన్ మాత్రం మన వాళ్లు చాలా చెత్తగా బ్యాటింగ్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. "భారత జట్టు బ్యాటింగ్ చెత్త. ఇంగితజ్ఞానం లేదు. పళ్ళెంలో పెట్టి మ్యాచ్ ను ఆస్ట్రేలియాకు అందించారు"("Rubbish batting by the Indian team. No common sense. Gave away a winning game on a platter,") అని అజారుద్దీన్ ట్వీట్ చేశారు.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 152 పరుగులకు ఆలౌట్ అయింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది. 43 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 33 పరుగులు చేసింది. చివర్లో బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డెనర్ 3, మెగాన్ షట్ రెండు వికెట్లు తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మూనీ 41 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేయగా, కెప్టెన్ మెగ్ లానింగ్ 36, గార్డెనర్ 25, హేన్స్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, స్నేహ్ రాణాకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు స్వర్ణ పతకం దక్కగా, భారత్ రజతంతో సరిపెట్టుకుంది.

Next Story