సెమీస్‌కు ముందు పాక్‌కు గట్టి షాక్..!
Mohammad Rizwan Shoaib Malik Doubtful For Semis.టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో అజేయంగా దూసుకుపోతుంది పాకిస్థాన్.
By తోట వంశీ కుమార్ Published on 11 Nov 2021 1:25 PM ISTటీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో అజేయంగా దూసుకుపోతుంది పాకిస్థాన్. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. అయితే.. కీలకమైన సెమీస్ కు ముందు పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు మహమ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్‌లు ప్లూ బారిన పడ్డారు. దీంతో బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా దూరంగా ఉన్నారు. రెండు రోజుల నుంచి ప్లూ జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసీసీ వీరిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే.. అందులో నెగెటివ్ వచ్చింది. అయితే.. నేడు(గురువారం) ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు ఆడాతారా..? లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
కాగా.. ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు స్పందించింది. మహమ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. కరోనా సోకలేదని.. లో ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అందుకే వీరు బుధవారం ప్రాక్టీస్‌కు రాలేదని.. గురువారం ఉదయం మరోసారి పరీక్షించి అనంతరం వారిద్దరిని తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని పీసీబీ అధికారి వెల్లడించారు. ఒక వేళ వీరిద్దరు ఆడకపోతే.. వీరి స్థానంలో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.