చ‌రిత్ర సృష్టించ‌నున్న మహ్మద్ రిజ్వాన్.. ఒక్క దెబ్బ‌తో కోహ్లీ-బాబర్‌ల రికార్డ్ బ‌ద్ధ‌ల‌య్యే ఛాన్స్‌..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ (PAK vs NZ 2nd T20I)లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ భారీ రికార్డును సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు

By Medi Samrat  Published on  19 April 2024 9:00 AM GMT
చ‌రిత్ర సృష్టించ‌నున్న మహ్మద్ రిజ్వాన్.. ఒక్క దెబ్బ‌తో కోహ్లీ-బాబర్‌ల రికార్డ్ బ‌ద్ధ‌ల‌య్యే ఛాన్స్‌..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ (PAK vs NZ 2nd T20I)లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ భారీ రికార్డును సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో టీ20 ఏప్రిల్ 20న రావల్పిండిలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ 19 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్క‌నున్నాడు. త‌ద్వారా అత‌డు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ల రికార్డును అధిగ‌మించ‌నున్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్‌లో 90 మ్యాచ్‌లలో 78 ఇన్నింగ్స్‌లలో 2,981 పరుగులు చేశాడు. టీ20లో 3000 పరుగులు పూర్తి చేసేందుకు కేవలం 19 పరుగుల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో రిజ్వాన్ 19 పరుగులు చేస్తే, టీ20లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.

టీ20 ఫార్మాట్‌లో 3,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి మొత్తం 81 ఇన్నింగ్స్‌లు పట్టింది. బాబర్ ఆజం విషయంలో కూడా అలాగే జరిగింది. బాబ‌ర్‌ 81 ఇన్నింగ్స్‌లు ఆడి T20 ఇంటర్నేషనల్‌లో మూడు వేల పరుగులు చేశాడు, అయితే రిజ్వాన్ 78 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు.

Next Story