BCCI జాతీయ సెలెక్టర్లు సోమవారం ప్రకటించిన T20 ప్రపంచ కప్-2022 కోసం భారతదేశం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాయం నుంచి కోలుకున్న పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు పిలిచారు. ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకోవాలని కోరగా, దీపక్ హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
టోర్నీ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ లేకపోవడం పట్ల అజార్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మెయిన్ స్క్వాడ్‌కు ఎంపిక చేసిన దీపక్ హూడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉండాలని, ఇక హర్షల్ పటేల్ స్థానంలో షమీని తీసుకోవాలని అజార్ తన ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. వరల్డ్‌కప్ జట్టు కోసం స్టాండ్‌బైలను ప్రకటించిన జాబితాలో అయ్యర్, షమీ ఉన్న విషయం తెలిసిందే.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ఆటగాళ్లు:
మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్