సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలోకి చేరే అవకాశం ఉందిని పార్టీ వర్గాల సమాచారం. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారిక ధృవీకరణ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఆగస్టులో సుప్రీంకోర్టు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల నామినేషన్లను కొట్టివేసిన తరువాత, అజారుద్దీన్ గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ అయ్యారు. సవరించిన జాబితాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోదండరామ్ అజా,రుద్దీన్‌లను నామినేట్ చేశారు. ఆయన చేరికతో, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కి పెరుగుతుంది. ముఖ్యమంత్రితో సహా తెలంగాణలో మంత్రి మండలి మొత్తం బలం 18గా ఉంది.