న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) తరపున ఆడబోతున్నాడు. గాయం కారణంగా విల్ జాక్స్ టోర్నమెంట్ కు దూరం కావడంతో అతని స్థానంలో 32 ఏళ్ల మైఖేల్ బ్రేస్‌వెల్ వచ్చాడు. బ్రేస్‌వెల్ తన బేస్ ప్రైస్ 1 కోటితో ఆర్సీబీకి ఆడనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ODI, T20I సిరీస్‌లలో పాల్గొన్న బ్రేస్‌వెల్‌కు భారతదేశంలో ఆడిన అనుభవం ఉంది. 117 T20లలో, బ్రేస్‌వెల్ ఒక సెంచరీ, 13 అర్ధ సెంచరీలతో 30.86 సగటుతో మరియు 133.48 స్ట్రైక్-రేట్‌తో 2284 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 40 వికెట్లు కూడా తీశాడు.
ఇంగ్లండ్ జట్టుకు చెందిన విల్ జాక్స్‌కు ఇటీవల గాయమైంది. గాయం కారణంగా ఐపీఎల్ 2023కు దూరమయ్యాడు. జాక్స్ బంగ్లాదేశ్ పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్ రెండవ వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా విల్ జాక్స్ కుడి భుజానికి గాయమైంది. స్కానింగ్, వైద్య నిపుణుల సలహా కారణంగా ఐపీఎల్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది.