క్రికెట్‌లో కొత్త నిబంధనలు.. మన్కడింగ్ పై నిషేధం, క్యాచ్ ఔట్ సమయంలో
MCC permanently bans use of saliva to shine ball.క్రికెట్‌లో ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలు రాబోతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2022 1:01 PM ISTక్రికెట్‌లో ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మన్కడింగ్, క్యాచ్ ఔట్ సమయంలో స్ట్రైకింగ్, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి వాటిలో మార్పులు చేశారు. మన్కడింగ్ క్రీడాస్పూర్తికి విరుద్దమని దాన్ని రూల్స్ నుంచి తీసేస్తున్నట్లు మెరిల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) తెలిపింది. కొద్ది రోజుల్లో దీనిపై ఓ ప్రకటనను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఎంసీసీ తీసుకురానున్న కొత్త నిబంధనలు ఇవే..
మన్కడింగ్‌పై నిషేధం
బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే బౌలర్ అతన్ని ఔట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. కాగా.. మన్కడింగ్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్ధమని ఎంసీసీ తెలిపింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండే ఏ బ్యాటర్ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉండాలి. దానిలో భాగంగా బ్యాటర్ క్రీజు దాటే అవకాశం ఉంటుందని చెప్పింది. అందుకనే.. ఇకపై మన్కడింగ్‌పై నిషేదం విధిస్తున్నట్లు చెప్పింది.
కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌కు
బ్యాటర్ క్యాచ్ ఔట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ విషయంలోనూ మార్పు చేసింది. బ్యాటర్ క్యాచ్ ఇచ్చినప్పుడు ఆ క్యాచ్‌ను ఫీల్డర్ అందుకునే లోపు ఇద్దరు బ్యాటర్లు పరుగుకు కోసం ప్రయత్నించే క్రమంలో ఒకరినొకరు దాటితే.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాట్స్‌మెన్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకముందు క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపుకు వెళ్లేవాడు.
లాలాజలం బంతిపై పూయకూడదు
సాధారణంగా బంతిని షైన్ చేసేందుకు సలైవా(లాలాజలం) ఉపయోగించేవారు. అయితే.. కరోనా కారణంగా బౌలర్లు బంతిపై లాలా జలాన్ని పూయడాన్ని తాత్కాలికంగా నిషేదించారు. అయితే.. ఇప్పుడు దీన్ని పూర్తిగా నిషేదిస్తున్నట్లు ఎంసీసీ తెలిపింది. బంతిపై సలైవా పూయడం వల్ల, బంతి ఉత్పత్తి చేసే సార్థమ్యంపై ప్రభావం చూపుతుందని అందుకనే బౌలర్లు సలైవాను ఉపయోగించవద్దు అని తెలిపింది.
వైడ్ విషయంలోనూ..
- క్రికెట్‌లోని నిబంధన 22.1 ప్రకారం.. ఇకపై స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నిలబడి స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించాలనే కొత్త నిబంధనను తీసుకువచ్చింది. డెడ్‌బాల్స్‌తో పాటు కట్‌స్ట్రిప్ దాటిన బంతిని బ్యాట్స్‌మన్ టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్స్‌ను రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.