వానొచ్చింది.. పాక్ మ్యాచ్ రద్దైంది..!

టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 8:14 AM IST

వానొచ్చింది.. పాక్ మ్యాచ్ రద్దైంది..!

టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 తొలి మ్యాచ్ వర్షార్పణం అయింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ సూపర్-8 గ్రూప్ 2 మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మ్యాచ్ సమయానికి మొదలైన వర్షం ఆగనేలేదు. మైదానం ఆటకి అనుకూలంగా లేకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నేడు సూపర్-8 లో భాగంగా రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక జట్లు తలపడనుండగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. పల్లెకెలెలో వర్షం ముప్పు పొంచి ఉన్నా, అహ్మదాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉంది.

Next Story