కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్
Martin Guptill Surpasses Virat Kohli In Elite T20I List.పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2021 2:51 PM ISTపరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గప్తిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమ్ఇండియా టీ20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. విరాట్ కోహ్లీ 95 ఇన్నింగ్స్‌లో 3227 రన్స్ చేశాడు. రాంచీ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో విరాట్ రికార్డును గప్తిల్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్ 15 బంతుల్లో 31 రన్స్ చేశాడు. ఈ క్రమంలోనే విరాట్‌ను అధిగమించాడు. గప్తిల్ 111 ఇన్నింగ్స్‌లో 3248 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత భారత టీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 3,141 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ అరుదైన రికార్డు..
టి20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లి రికార్డును రోహిత్ సమం చేశాడు. రెండో టీ20లో 55 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్ 118 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా.. కోహ్లి 95 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ నాలుగు శతకాలు బాదగా.. కోహ్లీ ఒక్కసెంచరీ కూడా సాధించలేదు.