ధోనీకి ఆపరేషన్ సక్సెస్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీకి గురువారం మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఐపీఎల్‌లో మహీ మోకాలి సమస్యతో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2023 4:45 PM IST
Mahendra Singh Dhoni, knee surgery, Cricket, IPL2023

ధోనీకి ఆపరేషన్ సక్సెస్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీకి గురువారం మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఐపీఎల్‌లో మహీ మోకాలి సమస్యతో బాధపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై టైటిల్ గెలిచిన వెంటనే ముంబయిలోని ఆసుపత్రికి వెళ్లాడు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌కు పంత్‌కు చికిత్స అందించిన వైద్యుడిని సంప్రదించగా ఆపరేషన్‌ అవసరమని చెప్పారు. దాంతో ధోని మోకాలికి చికిత్స కోసం ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆపరేషన్‌ చేయగా అది విజయవంతమైంది. ధోనికి వైద్యుడు దిన్షా పార్దివాలా చికిత్స ఆపరేషన్‌ చేశారు. 2019లో ఒలింపిక్స్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రాకు సైతం ఆయనే ఆపరేషన్‌ చేశారు.

ధోని గాయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌ బుధవారం ప్రకటన చేశారు. ఐపీఎల్ సమయంలో ఎడమ మోకాలి గాయంతో ధోనీ ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యేకంగా బ్యాండేజీ కట్టుకుని బరిలోకి దిగేవాడని.. ఐపీఎల్ ధోని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ దిగడానికి సైతం కారణం ఇదేనని తెలిపారు. గాయంపై వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.

Next Story