SRH vs RR Qualifier-2 Pitch Report : చెపాక్‌లో వర్షం కురుస్తుందా.? వికెట్ల వాన ప‌డుతుందా.?

శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది

By Medi Samrat  Published on  24 May 2024 8:27 AM IST
SRH vs RR Qualifier-2 Pitch Report : చెపాక్‌లో వర్షం కురుస్తుందా.? వికెట్ల వాన ప‌డుతుందా.?

శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎవరు ఆడాలో ఈ మ్యాచ్ డిసైడ్ చేయ‌నుంది.

ఈ సీజన్‌లో ఇరు జట్లకు హెచ్చు తగ్గులు ఉన్నాయి. సన్‌రైజర్స్.. తమ దూకుడు ఆటతో IPL 2024లో సంచలనాత్మక ఆరంభం చేసారు. అయితే క్వాలిఫయర్-1లో నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు బ్యాటింగ్ దెబ్బతింది. అయిన మ‌రో ఛాన్స్ ఉండ‌టంతో క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఇక వరుస ఓట‌ముల త‌ర్వాత విజయం సాధించిన‌ రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్ చేరాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసుకుని మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చిన రాజస్థాన్.. ఫైనల్స్‌కు వెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. గ‌త కొన్ని మ్యాచ్‌లుగా జైస్వాల్ బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు. RCBపై అతడు ఫామ్‌లోకి వ‌చ్చాడు. రియాన్ పరాగ్ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్ జట్టు వీరు మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది.

ఇక చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ గురించి చెప్పాలంటే.. ఇక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలమైనది. ఏది ఏమైనప్పటికీ.. IPL ముగింపుకు చేరుకుంది. ఇక్కడ చాలా మ్యాచ్‌లు జ‌రిగాయి. దీంతో పిచ్ స్లో కావడం సహజమే కానీ.. పరుగులు రావ‌ని కాదు.. బ్యాట్స్‌మెన్ క్రీజులో నిల‌దొక్కుకోవాలి. బౌండ‌రీ సరిహద్దులు 66మీ-70మీగా ఉన్నాయి. స్ట్రెయిట్ హిట్ 79మీగా ఉంది.

ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 164 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 151 పరుగులు. గత ఐదు మ్యాచ్‌లలో వేదికపై సగటు T20 స్కోరు 172. టాస్ గెలిచిన జట్లు గత ఐదేళ్లలో 61 శాతం బౌలింగ్‌ను ఎంచుకున్నాయి.

ఇక‌ చెపాక్‌లో వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉంది కానీ 47 డిగ్రీలు ఉన్న‌ట్లు అనిపిస్తుందని వ్యాఖ్యాత‌లు అంటున్నారు.ఇక‌.. శుక్రవారం చెన్నైలో వర్షం కురిసే అవకాశాలు లేవు. చెన్నైలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ ద‌గ్గ‌ర‌లో ఉంటుంది. MA చిదంబరం స్టేడియం వద్ద గాలి వేగం గంటకు 19 కి.మీ కాగా.. సాయంత్రం తేమ స్థాయి 71 శాతం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ విభాగం తెలిపింది.

Next Story