పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులోకి వచ్చిన భయంకరమైన ఫాస్ట్ బౌలర్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి ఒక భయంకరమైన ఫాస్ట్ బౌలర్ వచ్చాడు.
By Medi Samrat Published on 30 March 2024 6:05 PM ISTపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి ఒక భయంకరమైన ఫాస్ట్ బౌలర్ వచ్చాడు. ఆ ఫాస్ట్ బౌలర్ మరెవరో కాదు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ మాట్ హెన్రీ. డేవిడ్ విల్లీ స్థానంలో హెన్రీని లక్నో జట్టులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విల్లీ తన పేరును టోర్నీ నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం.
లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ విల్లీకి బదులుగా IPL 2024 కోసం మాట్ హెన్రీని జట్టులో చేర్చుకుంది. హెన్రీని లక్నో తన ప్రాథమిక ధర రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేసింది. హెన్రీ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. హెన్రీ రాకతో లక్నో పేస్ అటాక్ గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తోంది.
మాట్ హెన్రీ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున మొత్తం 17 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. 82 వన్డే మ్యాచ్‌లలో 141 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ తన వేగంతో పాటు మంచి లైన్ లెంగ్త్ బౌలర్‌గా కూడా పేరుగాంచాడు.
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్‌కు శుభారంభం లభించలేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బౌలింగ్‌లో మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్ ఇద్దరూ గట్టిగా పరుగులిచ్చారు. మొహిసన్ 4 ఓవర్లలో 45 పరుగులు ఇవ్వగా.. నవీన్ 41 పరుగులు ఇచ్చాడు. స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ కూడా దారుణంగా పరాజయం పాలయ్యావిఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో కూడా కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్ మాత్రమే తమదైన ముద్ర వేయగలిగారు.