లక్నో జట్టుకు మ‌రిన్ని క‌ష్టాలు.. స్వ‌దేశానికి వెళ్తున్న స్టార్ బౌల‌ర్‌

Lucknow Super Giants pacer Mark Wood leaves tournament midway for birth of his daughter. ఐపీఎల్ 2023 52వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.

By Medi Samrat
Published on : 8 May 2023 3:30 PM IST

లక్నో జట్టుకు మ‌రిన్ని క‌ష్టాలు.. స్వ‌దేశానికి వెళ్తున్న స్టార్ బౌల‌ర్‌

Lucknow Super Giants pacer Mark Wood leaves tournament midway for birth of his daughter


ఐపీఎల్ 2023 52వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఇప్ప‌టికే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో టోర్నీకి దూరం కాగా.. టీమ్‌కి చెందిన మ‌రో ఆట‌గాడు, ఇంగ్లీష్ బౌలర్ మార్క్ వుడ్ వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లాడు. లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో ద్వారా ఈ సమాచారం అందింది. లక్నో జట్టు బౌలర్ మార్క్ వుడ్ అకస్మాత్తుగా జట్టును వదిలి తన ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

తొలి మ్యాచ్‌లోనే 14 పరుగులిచ్చి మొత్తం 5 వికెట్లు తీసిన మార్క్ వుడ్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల నుంచి టీం లో చోటు ద‌క్క‌లేదు. గ‌త మ్యాచ్‌లోనూ అత‌నికి ప్లేయింగ్‌-11లో అవకాశం రాలేదు.

అయితే.. లక్నో సూపర్ జెయింట్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో మార్క్ వుడ్ తన స్వదేశానికి తిరిగి వెళ్తున్న‌ట్లు స్వయంగా చెబుతున్నాడు. మార్క్ వుడ్ తండ్రి కాబోతున్నాడని.. ఈ సమయంలో అతను తన భార్య సాహాతో ఎక్కువ‌ సమయం గడపాలనుకుంటున్నట్లు తెలిపాడు. నేను జట్టు నుండి వైదొలగుతున్నానని ప్రకటించడానికి బాధగా ఉంది, కానీ ఇంటికి వెళ్ళడానికి సరైన కారణం ఉంది. త్వరలో టీమ్‌తో మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను. నేను 4 మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించ‌లేకపోయినందుకు క్షమించండి. నేను కొన్ని వికెట్లు తీశాను, కానీ త్వరలో రాణిస్తాన‌ని ఆశిస్తున్నానన్నాడు.

మార్క్ వుడ్ ఇంకా మాట్లాడుతూ.. ఈ టీమ్ చాలా బాగుందని, నాకు మొత్తం టీమ్, సపోర్టింగ్ స్టాఫ్ అంటే చాలా ఇష్టం. తోటి ఆటగాళ్లు వివిధ రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాకు కేవలం ఒక విజయం మాత్రమే అవసరమని నాకు తెలుసు.ఆ తర్వాత మేము ప్లేఆఫ్‌కు వెళ్తాము. ఆ ప్లేఆఫ్ నుండి ఫైనల్స్‌కు చేరుకోవాలి. ఈ లక్ష్యం మొత్తం జట్టుకు చెందినది. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. క్రీడల్లో గెలుపు ఓటములు అనే ప్రక్రియ సాగుతుంది. కానీ మన ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారని అన్నాడు.




Next Story