సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ.. పోరాడిన పంజాబ్

Lucknow Super Giants beat Punjab by 56 runs. మొహాలీలో విధ్వంసం సృష్టించారు బ్యాటర్లు. లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ పై సూపర్ విక్టరీని అందుకుంది.

By Medi Samrat  Published on  29 April 2023 8:00 AM IST
సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ.. పోరాడిన పంజాబ్

మొహాలీలో విధ్వంసం సృష్టించారు బ్యాటర్లు. లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ పై సూపర్ విక్టరీని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 258 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. అధర్వ తైడే 66, సికిందర్ రజా 36 రాణించినా.. కావాల్సింది భారీ రన్ రేట్ కావడంతో పంజాబ్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. శామ్ కరన్ 21, జితేశ్ శర్మ 24 పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. స్టొయినిస్ 72, కైల్ మేయర్స్ 54, ఆయుష్ బదోనీ 43, నికోలాస్ పూరన్ 45 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు. 2013 సీజన్ లో ఆర్సీబీ జట్టు పుణే వారియర్స్ పై 5 వికెట్లకు 263 పరుగులు చేయగా, ఆ తర్వాత స్థానంలో లక్నో జట్టు నిలిచింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేసి లక్నో భారీ స్కోరుకు సరైన పునాది వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ, స్టొయినిస్ జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. బదోనీ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు సాధించాడు. ఇక స్టొయినిస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టొయినిస్ 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. స్టొయినిస్ స్కోరులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇక పూరన్ కేవలం 19 బంతులాడి 7 ఫోర్లు, 1 సిక్స్ తో 45 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబాడా 2, అర్షదీప్ సింగ్ 1, శామ్ కరన్ 1, లియామ్ లివింగ్ స్టోన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో నిలిచింది.


Next Story