ఓట‌మి బాధ‌లో ఉన్న కివీస్‌కు గ‌ట్టి షాక్‌

Lockie Ferguson is ruled out from T20 world cup.అస‌లే పాకిస్థాన్‌తో ఓట‌మి బాధ‌లో ఉన్న న్యూజిలాండ్‌కు గ‌ట్టి షాక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 10:01 AM GMT
ఓట‌మి బాధ‌లో ఉన్న కివీస్‌కు గ‌ట్టి షాక్‌

అస‌లే పాకిస్థాన్‌తో ఓట‌మి బాధ‌లో ఉన్న న్యూజిలాండ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ లోకీ ఫెర్గూస‌న్ గాయంతో టోర్నీ మొత్తానికే దూరం అయ్యాడు. అత‌డు కాలిగాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో పాక్‌తో మ్యాచ్ కూడా అత‌డు ఆడ‌లేదు. ఎంఆర్ఐ స్కాన్ చేయ‌గా.. ప్రాక్చ‌ర్‌ అని తెలిసింది. విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. దీంతో అత‌డు టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఆదివారం బ‌ల‌మైన భార‌త జ‌ట్టుతో పోటికి ముందు అత‌డు దూరం కావ‌డం న్యూజిలాండ్‌కు గ‌ట్టి దెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. అత‌డి స్థానంలో మిల్నేను జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, న్యూజిలాండ్ రెండు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓట‌మి పాలైయ్యాయి. సెమీస్ చేరాలంటే.. ఇరు జ‌ట్లు ప్ర‌తి మ్యాచ్‌లోని గెల‌వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం దుబాయ్ వేదిక‌గా కీవిస్‌, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ కాకుండా మిగతా మూడు చిన్న జ‌ట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాల‌పై విజ‌యాలు సాధించ‌డం పెద్ద క‌ష్టం కాదు కాబ‌ట్టి.. భార‌త్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు సెమీస్‌లో అడుగుపెట్టే అవ‌కాశం చాలా ఎక్కువ ఉంది. కాబ‌ట్టి ఇరు జ‌ట్ల‌కు ఇది చావో రేవో అని చెప్పాలి.

Next Story
Share it