బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది. భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో బంగ్లా నడ్డివిరచగా, సిరాజ్ మూడు , అక్షర్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఓవర్ నైట్ స్కోర్ 133 8 స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరంభించిన బంగ్లా మరో 17 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎబాడట్(17)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చగా, హసన్ మిరాజ్(25)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. దీంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుకు మొగ్గు చూపలేదు. బ్యాటింగ్ చేసేందుకే ఆసక్తి చూపాడు. దీంతో టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. నేటితో కలిపి మూడు రోజుల ఆట మిగిలిన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం దాదాపుగా ఖాయం.