కృనాల్ పాండ్యాకు క‌రోనా.. రెండో టీ20 వాయిదా

Krunal Pandya Tests COVID Positive.రెండో టీ20 మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికుల‌కు క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 10:42 AM GMT
కృనాల్ పాండ్యాకు క‌రోనా.. రెండో టీ20 వాయిదా

రెండో టీ20 మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికుల‌కు క‌రోనా ఊహించ‌ని షాక్ ఇచ్చింది. భార‌త ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాకి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నేడు జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లు ఐసోలేష‌న్‌కు వెళ్లాయి. ఒక‌వేళ టీమ్‌లోని మిగ‌తా అంద‌రికి నెగ‌టివ్ అని తేలితే.. బుధ‌వారం రెండో టీ20ని నిర్వ‌హించ‌నున్నారు.

ఇక ఆదివారం జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ 38 ప‌రుగుల తేడాతో గెలిచిన సంగ‌తి తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో కృనాల్ ఆడాడు. రెండు ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 3 బంతుల్లో 3 ప‌రుగులు చేశాడు.

కాగా.. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన లంక జ‌ట్టులో కోచ్‌, స‌హాయ‌క సిబ్బందికి క‌రోనా రావ‌డంతో జులై 13న ప్రారంభం కావాల్సిన వ‌న్డే సిరీస్ 18కి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్‌లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీ20 సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తున్న త‌రుణంలో క‌రోనా క‌ల‌వ‌రం రేపింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు చివ‌రి సిరీస్ కావ‌డంతో కుర్రాళ్ల‌ను భార‌త జ‌ట్టు ప‌రీక్షిస్తోంది. తొలి పోరులో సూర్య‌కుమార్ యాద‌వ్ ఆక‌ట్టుకున్నాడు.

Next Story
Share it